ఎండలు మండుతున్న వేళ ప్రజల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావటం అభినంద నీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి శనివారం స్థానిక గడియారం స్తం భం సెంటర్లో దాతలు సహకారంతో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మద్దిశెట్టి మాట్లాడుతూ …దాతృత్వంతో మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెప్పారు. ఎంపీపీ సుధా అచ్చయ్య ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మం డల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, కౌన్సిలర్లు మేడగం మోహన్ రెడ్డి, వీసీ రెడ్డి, మిల్లర్ బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.


