బీజేపీ వారోత్స వాల్లో భాగంగా కిసాన్ మోర్చా జిల్లా
అధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘ సేవకులు జి.విరత్నంకి ఘన సన్మానం నిర్వహించారు. పార్టీ దర్శి అసెంబ్లీ, కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు, జి. వి రత్నంకు పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. సంఘ సేవకులు జి. వి రత్నం అన్ని రంగాల పై అవగాహన ఉన్న వ్యక్తి అని… ఆయన జీవితం సంఘ సేవకు అర్పించిన వారిలో రత్నం లాంటి వారు అరుదుగా ఒకరు ఉంటారని కొనియాడారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అచ్యుత గురువర్ధన్ రావు, వెంకటరెడ్డి, నాగభూషణం ఆచారి, ఆంజనేయులు, వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు.
