ప్రశాంతంగా ముగిసిన గుంటి గంగ తిరునాళ్ల- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుపై దేవాదాయశాఖ, పోలీసులపై భక్తులు ప్రశంశలు – 3.5 లక్షల మంది భక్తుల సందర్శన

జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని జాతర శనివారం రాత్రి కోశా హాలంగా జరిగినది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడ లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించికుని మొక్కులు తీర్చుకున్నారు. పదకొండు విద్యుత్ ప్రభల ఏర్పాటు చేయగా, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రభలు దేవాలయానికి రెండు వైపుల ఉండటంతో భక్తులు ఆయా ప్రభల వద్దకు అధిక సంఖ్యలో వేళ్లారు. ఎక్కువ సమయం ఆయా ప్రభల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నారపుశెట్టి పాపారావు, టిడిపీ నాయకుడు పమిడి రమేష్, ఆయా పార్టీల ప్రభల మీద నుండి ప్రజలకు సందేశం ఇచ్చారు.
శభాష్ పోలీస్ …..
కట్టుదిట్టంగా పోలీసులు బందోబస్తు నిర్వహణ పట్ల భక్తులు హర్షం తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన బందో బస్తు శనివారం నుండి ఆదివారం వరకు తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, దేవాదాయ శాఖ అనుసరించిన వ్యూహంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆద్వర్యంలో దర్శి సీఐ రామకోటయ్యతో, పలువురు సీఐలు, ఎస్ఐ ప్రేమకుమార్ పలువురు ఎస్ఎస్ఐలు, సిబ్బంది కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికి రాత్రి 1.45 నిముషాల సమయంలో గుడి ఎదురు కొంత సేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినది. నాలుగు అంచెల భద్రత వలయంతో వాహనాలను తిరునాళ్లలో తిరుగకుండా అదుపు చేసారు. ముందుగా వాహనాలను, ద్విచక్ర వాహనాలతో రెండంచేల చెకింగ్ పోషులు ఏర్పాటు చేసి కిలో మీటరు దూరంలో ఆపివేయటం వలన 3.5 లక్షల మంది భక్తులు పాల్గొనటంతో తిరునాళ్ల నిధిలో ఇబ్బందులు లేకుండా పోయాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆయా ప్రభలపై నిర్వాహకులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
అలరించారు. గతంలో కన్నా భిన్నంగా కొంచెం హుసారుగా పాటలు పాడుతూ లయ
బద్దంగా అనుకరించటంతో ప్రజలు ప్రభల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *