గుంటి గంగా తిరునాళ్ల హుండీ ఆదాయం రూ. 1.69 లక్షలు

గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి భక్తుల సందర్శన వలన వచ్చిన హుండీ ఆదాయం రూ.1,69799 లని కందుకూరు దేవాదాయశాఖ ఇన్స్ఫెక్టర్ సత్యనారాయణ తెలిపారు. హుండీ ఆదాయాన్ని ఆదివారం సిబ్బంది లెక్కించారు. భక్తుల తాకిడి పెరిగినప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లను దేవాదాయ శాఖ చేయటం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసారు. కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసులు, ఈఓలు బాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు యాడిక యలమంద రెడ్డి, దేవదానం, గురు బ్రహ్మం, చిన్నయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, సిబ్బంది కె శ్రీనివాసరావు, పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావులు భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో శ్రమించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆర్టీసీ ఆదాయం రూ.8లక్షలు..

గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా ఎపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల వలన ఆర్టీసీకి రూ. 8లక్షల ఆదాయం సమకూరినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఆర్.ఎం సుధాకర్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *