రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోటార్లకు మీటర్లు బిగించి చార్జీలు పెంచి రైతుల మెడలకు ఉరితాళ్లు గా మారుతున్నాయని మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సోమవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు టిడిపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెలలో యూనిట్ కి 40 పైసలు పెంచడం ప్రజలకు భారంగా ఉందన్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిన జగన్మోహన్ రెడ్డి నీ ప్రజలు ఎందుకు నమ్మాలన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడు వేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. దర్శి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మేదరమెట్ల వెంకటరావు మాట్లాడుతూ 61 వేల రూపాయలు విలువచేసే ట్రాన్స్ఫార్మర్ను 1,30,000కు పెంచి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వద్ద భారీగా కొనుగోలు చేశారన్నారు. పులివెందులకు చెందిన ఓనర్ విశ్వేశ్వర్ రెడ్డికి 26 29 కోట్లు చెల్లించారన్నారు. మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు మాట్లాడుతూ హిందూజా కంపెనీ నుండి హైదరాబాదు కూకట్ పల్లి లో జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ11.10 ఎకరాల క్విడ్ ప్రో కింద కొట్టేసిందన్నారు. అందుకు బహుమానంగా 12 34 కోట్లు డిస్కమ్ నిధులు హిందూజాకో ధారధక్తం చేసింది అన్నారు. మాజీ జడ్పిటిసి కొక్కెర నాగరాజు మాట్లాడుతూ తన కేసుల మాఫీ కోసం ఆదాని సంస్థతో 7, మెగావాట్ల సౌర విద్యుత్తు సరఫరా అధిక రేట్లతో ఒప్పందం చేసుకుందన్నారు. మాజీ జెడ్పిటిసి వరగాని పౌలు మాట్లాడుతూ లక్షల కోట్లు అప్పు తెచ్చారు పన్నులు చార్జీలు పెంచి మరో లక్ష కోట్ల అప్పు ప్రజలపై భారం మోపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 34.776 కోట్లు విద్యుత్ బకాయిలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ చదివి తగ్గించాలని కోరుతూ లైన్ ఇన్స్పెక్టర్ సాంబయ్యకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోడిగం మస్తాన్, శంకరాపురం సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, వేముల సర్పంచ్ గజ్జల సుబ్బారెడ్డి, మారెళ్ళ ఎంపిటిసి పాలపర్తి సుబ్బారావు, తమ్మినేని బ్రహ్మం, మాజీ సర్పంచ్ ఇందూరి పిచ్చిరెడ్డి, చొప్పరపు నాగేశ్వరరావు, తానిపత్తి నర్సారెడ్డి, ఒంగోలు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి కొర్రపాటి బుచ్చిబాబు, గుద్దేటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ జంపాని శ్రీనివాసరావు, కాటూరి సాల్మన్, మాలంపాటి మల్లికార్జున, మాలంపాటి కోటయ్య, మేదరమెట్ల రాంబాబు, ఏరేసి వెంకటేశ్వర రెడ్డి చిమ్మిని కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

