( గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నట్లయితే వారిపై నిఘా పెట్టాలని ఎస్సై ఎల్ సంపత్ కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే వారి సమాచారం తెలుసుకొని అధికారులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో కోడిపందాలు పేకాట. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.
కొత్త వ్యక్తులపై నిఘా పెట్టాలి
10
Apr