ప్రకృతి వ్యవసాయంలో ఐదు అంతస్తుల పంటల విధానంను అమలు చేసే ప్రక్రియలో బాగంగా బుతు పవనాలకు ముందు విత్తన గుళికలు చల్లు విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, ప్రకృతి సాగు మండల ఇన్చార్జి పి. నరసింహులు అన్నారు. క్షేత్ర పర్యటనలో బాగంగా తూర్పగంగవరంలో 15 రకాల విత్తనాలకు జీజా మృతం, బూదిత పౌడరు కలిపి తయారు చేసిన విత్తన గుళికలను వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. డ్రై సోయింగ్లో బాగంగా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు పచ్చిరొట్ట విత్తనాలను ఐదు జాతుల విత్తనాలను 20 రకాల జొన్నలు, సజ్జలు, రాగులు తదితర విత్తన గుళికలు తయారు చేసారు. ఐసీఆర్పీలు మురళి, మౌనిక, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
విత్తన గుళికలతో బహుళ ప్రయోజనాలు – మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు
10
Apr