వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి

ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు వడదెబ్బ కు గురి కాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పోలవరం గ్రామంలో సోమవారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య సేవలు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు ఉదయం సాయంత్రం వేళల్లో పొలం పనులు చేసుకోవాలన్నారు. ఎండలో పొలం పనులు చేసినట్లయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అన్నారు. మూగజీవాల రైతులు పొలాలకు వెళ్లినప్పుడు చెట్ల కిందకు వెళ్లాలన్నారు. లేదా మీ వెంట తలపాగా గొడుగు మంచినీళ్లు తీసుకువెళ్లాలన్నారు. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు.12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు రక్తహీనత పట్ల అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో 117 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ఓ శరణ్య, డీఈవో వెంకట ప్రసాద్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *