మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని శివారాంపురం, కొర్రపాటి వారి పాలెం, కొత్త పాలెం గ్రామాలలో జగనన్నే మా తోడు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైఎస్ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, జేసీఎస్ మండ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ హనుమంతరావు, కోటేశ్వరరావు, ఏసు, మల్కాపురం, తాళ్లూరు సర్పంచులు వలి ,మేకల చార్లెస్ సర్జన్ ,గ్రామ జేసిఎస్ కన్వీనర్ విష్ణు, యలమందరావు తదితరులు పాల్గొని గడప గడప ను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేశారు. గత టీడీపీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వాల మధ్య తేడాలను వారికి తెలియజేశారు. ప్రజా మద్దతులో భాగంగా వారిని ప్రశ్నలు అడిగి అభిప్రాయాలను నమోదు చేశారు. ఇంటి య జమాని సెల్ ఫోన్ నుంచి 8298082960 నంబరుకు మిస్డ్ కాలు ఇప్పించారు. తరువాత ఇంటి యజమాని అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్లిక్కర్ ను అంటించారు.









