కలాంగ విద్యార్థులకు ఇంటి వద్దనే విద్య

మానసిక వికలాంగ విద్యార్థిని విద్యార్థులకు వారి వారి ఇంటి వద్దనే విద్య నేర్పించాలని ఐ ఈ ఏ ఎం ఓ ,ఎం రమేష్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భవిత కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులకు జగనన్న కి ట్లు అందించడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూములో ఉన్న జగనన్న విద్యా కి ట్లు పాడవకుండా శుభ్రపరచాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సెంటర్లను ఆయన పరిశీలించారు. సెంటర్లో గల వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు 50 మందికి, రవాణా బత్యం, విద్యార్థుల సహాయకులకు అలవెన్స్, ఇంటి వద్ద నేర్చుకుంటున్న విద్యార్థులకు అలవెన్స్ కింద 1,67,000 రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జి చంద్రమోహన్, ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాత, ఐ ఈ ఆర్ టి జి పిలిపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *