అవిభక్త భారత దేశంలో అంటరాని తనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరు సల్పిన తొలినాటి యోధుడు శ్రీ జ్యోతి రావు పూలే అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎస్పీ నాగార్జున రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, కో ఆప్షన్మెంబర్ కరిముల్లా, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావు, ఎంఈఓ జి. సుబ్బయ్య, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, మాజీ ఎంపీటీసీ పులి వికాస్, డిబి ఆర్సీ కోఆర్డినేటర్ వెంకటరావు, కెవీపాలెం జెసీ కన్వినర్ విష్ణు, పలువురు బీసీ సంఘ నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక ప్రజా స్వామ్యం అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటి ప్రజా స్వామ్యం కోసం కలలు కన్న గొప్ప సంఘ సంస్కర్త పూలే అని వక్తలు కొనియాడారు.
చైతన్య మూర్తి పూలే – మహాత్మాజ్యోతి రావు పూలే జయంతి నిర్వహణ
11
Apr