పేదల సంక్షేమమే జగనన్న ఆశయం – జోరుగా జగనన్న మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహణ

పేదల సంక్షేమే జగనన్న ఆశయం అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. మండలంలోని మల్కాపురం, తాళ్లూరు, మాధవరం గ్రామాలలో మంగళవారం జగనన్న మా నమ్మకం నువ్వే కార్యక్రమం వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచిలు వలి, మేకల చార్లెస్ సర్జన్, తాటికొండ నాగలక్ష్మిలు పాల్గొని ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమాన్ని వివరించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు బాబు చేసిన మోసంను, నేటి ప్రభుత్వంలో మాట మీద నిలబడే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసిన విధానాన్ని, పేదల కోసం భవిష్యత్ కోసం నిత్యం ఆయన చేస్తున్న కృషి వివరించారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలు అడిగి పూర్తి చేసారు. వారి అనుమతితో గోడపై మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించారు. 8296082960 నంబర్కు వారి సెల్ నుండి మిస్ట్ కాల్ ఇచ్చి మద్దతు తెలిమని చెప్పారు. ఆయా కార్యక్రమాలలో కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఎంపీటీసీ మెడగం వెంకట రామిరెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పులి వికాస్, నుసుం చిన ఆంజనేయులు, విష్ణు తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *