సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే ఘనంగా నివాళులు

దర్శి తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రసన్న అధ్యక్షతన సభా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు సంఘ సేవకులు జీవి రత్నం, పి డి సి ఎస్ డైరెక్టర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం వెంకటేశ్వరావు మాట్లాడుతూ .. భారతదేశంలో మొట్టమొదటి చదువులను ప్రోత్సహించి బడుగు బలహీన వర్గాలకోసం అహర్నిశల కృషిచేసిన మహిళలు మహాత్మ జ్యోతిరావు పూలే అని వారు కొనియాడారు.
రాష్ట్రదళితసేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. ఈనెల ఐదవ తేదీ నుండి 14 తారీకు వరకు దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సేవలందించి దేశ స్థాయిలో చిరస్మరణగా నిలిచిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజ్జివన్ రావు వారి ఆశల కోసం నిరంతరం నేటి తరం కొనసాగించవలసిందిగా కోరారు .
కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నరసింహారావు, రామారావు, వీఆర్వో, వీఆర్ఏ, తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *