పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా నడుచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు -బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం అడుగులేస్తోంది – రెండున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలు బలహీన వర్గాలు ఎలా అవుతారు? – తెదేపాతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం

బడుగు బలహీన వర్గాలను ఆర్ధికంగా సమాజికంగా రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పోరాడిన జ్యోతీరావుపూలే ఆశయ సాధనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతీరావు పూలే జయంతి కార్యక్రమంలో నూకసాని బాలాజీ పాల్గొన్నారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. రెండు శతాబ్దాల క్రితమే బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పోరాటాలు సాగించినప్పటికీ, స్వాతంత్ర్యానంతరం వారికి అభ్యున్నతి సాకారం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాలుగా పిలవబడే వారికి రాజకీయంగా అవకాశాలు దక్కాయి. గ్రామ సర్పంచుల నుండి చట్ట సభల వరకు అన్నింటా బీసీలకు అవకాశం లభించింది. అప్పటి వరకు ఓట్లు వేయడానికి మాత్రమే అన్నట్లు ఉన్న బీసీలు ఓట్లు వేయించుకుని చట్ట సభల్లో అడుగు పెట్టారు. రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా అభివృద్ధి సాధించారు. బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకుంటే, దాన్ని చంద్రబాబు 34శాతానికి పెంచారు. జగన్ రెడ్డి వచ్చాక కుట్రపూరితంగా రిజర్వేషన్లను 24శాతానికి కుదించి 17వేల మందికి పదవులు దూరం చేశారు. 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారు. 2500 మందికి పైగా బీసీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. 700 మందికి పైగా బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధఇంచారు. 56కార్పొరేషన్లు ఏర్పాటు చేశానంటూ హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి, ఎంత ఖర్చు చేశారు? ఎంత మందికి స్వయం ఉపాధి రుణాలిచ్చారు? పైసా బడ్జెట్ ఖర్చు చేయకుండా, కనీసం ఛైర్మన్లు కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారు. ఆదరణ లాంటి పథకాలు రద్దు చేశారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి విద్యా పథకాలు రద్దు చేశారు. అయినా ఇంకా బీసీల్ని ఉద్దరించానని జగన్ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని నూకసాని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం పూలే సేవలు చిరస్మరణీయం. అంబేద్కర్ లాంటి వ్యక్తులే పూలేని గురువుగా అభివర్ణించారంటే పూలే గొప్పతనాన్ని మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వందేళ్ల క్రితమే స్కూల్ పెట్టి మహిళల్ని చదివించారు. అంబేద్కర్, పూలే మాదిరిగా ఎన్టీఆర్ బలహీనవర్గాల అబ్యున్నతి ఆలోచించారు. బీసీలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. వారి గురించి ఆలోచించి, అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా పూలే గురించి మాట్లాడుకోవడం ఆయన చేసిన కృషికి అద్దం పడుతోంది. చదువుతోనే సమాజాభివృద్ధి అని నమ్మి, ఆచరించిన వ్యక్తి పూలే. నాటి పూలే అడుగుజాడల్లో ఎన్టీఆర్ నడిచారు. బలహీన వర్గాలకు అండగా నిలిచారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధంగా బీసీలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు. విద్య లేనిదే సమాజంలో వికాసం లేదు. విద్యతోనే సమాజాభివృద్ధి అని నమ్మి భార్యను కూడా చదివించి, ఆమెతో మరికొంత మందికి తరగతులు బోధించేలా చేసి విద్యావంతుల్ని చేసిన మహనీయుడు పూలే. అటువంటి మహనీయుడి ఆదర్శాలను పునికిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో కృషి చేసిన బీసీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు కేఎస్ జవహర్ పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *