టిడిపి జాతీయ నాయకుడు నారా లోకేష్ తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండల కేంద్రానికి పాదయాత్రగా వచ్చిన సమయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి, బయలుదేరడo కానీ చేయలేదు, సరికదా బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాల కూడా వేయకుండా అవమానించిపోవడం దురృష్టకరమని సిపిఐ, దళిత సంఘాల నాయకులు రేపటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసేలోగా నారా లోకేష్ యువ గళంను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అంబేద్కర్ అవమానపరిచినందుకుగాను వీరు ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. భవిష్యత్తులో రాజ్యాంగ నిర్మాతకు ఎక్కడైనా లోకేష్ తన యువగలం పాదయాత్రలో అవమానం కలిగిస్తే అక్కడికి సైతం వచ్చి పాదయాత్రను అడ్డుకుంటామని, సిపిఐ మండల కార్యదర్శి చింత పురుషోత్తం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు ఆదినారాయణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వీర నాగరాజు, సూరి, నాగార్జున తదితరులు పేర్కొన్నారు.
లోకేష్ యువ గళాన్ని అడ్డుకుంటాం
11
Apr