14 న బాలినేని పర్యటన ను జయప్రదం చేయండి.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

ఏప్రియల్ 14 వ తేది న చీమకుర్తి లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సాయంత్రం 5 గంటలకు చీమకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జిల్లా పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన జనరేటర్ ను, బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్చ్ ప్రారంభం,మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన జిమ్ మరియు తహశీల్దార్ ఆఫీస్ వద్ద అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు అని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్యక్రమములో పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,ఎమ్మెల్యే టి.జె.ఆర్ సుధాకర్ బాబు పాల్గొంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీను, zptc వేమా శ్రీను, టౌన్ పార్టీ అధ్యక్షులు కె.శేకర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ కౌన్సిలర్స్, JCS కన్వీనర్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *