దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు చేరువచేసే సదరం వైకల్య ధ్రువపత్రాలకు సంబంధించి మూడు నెలలకు స్లాట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి గ్రామ, వార్డు. సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో మూడు నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నమోదు చేసుకున్న వారు జిల్లాలో సదరం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రు లను సంప్రదించాలి. తద్వారా వైకల్యం శాతాన్ని వైద్యుడు పరీక్షించి. ధ్రువపత్రాలు మంజూరు చేస్తారు..
జిల్లాలో శిబిరాలు ఇక్కడే..
ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో మానసిక, నేత్ర,ఆర్థో, మార్కాపురం జిల్లా ఆసుపత్రి, చీరాల, కందుకూరు ఏరియా ఆసుపత్రుల్లో ఆర్థో, నేత్ర బాధితులను పరీక్షిస్తారు. ఆయా ఆసుప త్రుల్లో కేవలం ఆర్థో,నేత్ర సంబంధ ఇబ్బందులు ఉన్నవారికి చూస్తారు. కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కొండపి, పర్చూరు, యర్రగొండపాలెం సీహెచ్సీల్లో ఆర్థో రోగులకు మాత్రమే ఈ సదరం శిబిరాలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో ఎక్కడైనా…
రాష్ట్రంలోని ఏ జిల్లాలోని వైద్యశాలలోనైనా తమ వైకల్యానికి సంబందించిన స్లాట్న నమోదు చేసుకోవచ్చు. గతంలో జిల్లాకు చెందిన వారు ఆ జిల్లా వైద్యశాలల్లో మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా నమోదు చేసుకునే వెసులు బాటు కల్పించారు. ప్రస్తుతం జిల్లాలో ఈఎన్టికి సంబంధించి స్లాట్లు అందుబాటులో లేవు. అందువల్ల మూగ, వినికిడి లోపం కలిగిన వారు ఇతర జిల్లాల్లో నమోదు చేసుకోవచ్చు. వారు జిల్లాలోని వైద్యశాలకు ఆయా తేదీలో శిబిరానికి వెళ్లాలి.