తాళ్లూరులో నూజివీడు సీడ్స్ మొక్కజొన్న విన్నర్ – 8352 సాగు తోటలను నూజివీడు సీడ్స్ సిబ్బంది బుధవారం క్షేత్రస్థాయి ప్రదర్శన చేశా రు.గ్రామానికి చెందిన కోట కోటిరెడ్డి సాగు చేసి విన్నర్ -8352 పంటపొలాన్ని పరిశీ లించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కంపెనీ అధికారి డిఆర్ ఎం. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ విన్నర్-8352 రకం మొక్కజొన్న సీడ్స్ గురించి, యూనిక్ పాయింట్స్ పై వివరించారు. ఈ సీడ్ ఒకే ఎత్తులో ఎదగటం వల్ల గాలికి పడకుండా కండె చివరివరకు గింజ పాలుపోసుకుని వుంటుందన్నారు. దిగుబడి 45 నుండి 50 క్వింటాళ్లు వస్తుందన్నారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఎమ్ టి.సాం బశివరావు, జి.వీరరాఘవులు, బి.నాని పలువురు రైతులు పాల్గొన్నారు.

