భూసార పరీక్షలతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని దర్శి ఎడీఏ నిర్మల కుమారి అన్నారు. తాళ్లూరులో బుధవారం విఏఏలకు, రైతులకు మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎడీఏ నిర్మల కుమారి మాట్లాడుతూ భూసార పరీక్షలతో రైతులు వేయదలచిన పంటలకు సంబంధించి నత్రజని, భాస్వరం, పోటాష్ మరియు సూక్ష్మ పోషకాలు ఎరువుల మోతాదును సూచించటం జరుగుతుందని అన్నారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఎఈఓలు నాగరాజు, రాజ సుందరి, ప్రకృతి ఇన్చార్జి నరసింహులు, విఏఏలు పాల్గొన్నారు.
