ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన ఒంటేరు శ్రీను కు హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన యద్దనపూడి రామకోటయ్యను తన తల్లితో అక్రమ సంబంధం నెరుపుతున్నాడని అగ్ర హించిన ఒంటేరు శ్రీను 2015 వ సంవత్సరంలో కాపు కాసి గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులోవిచారణ అనంతరం ఇరువాదనలు విన్న అదనపు జిల్లా జడ్జి టి రాజా వెంకటాద్రి ,నిందితుడైన ముద్దాయికి యావజ్జీవ శిక్ష మరియు 2000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. 2 వేల రూపాయలు చెల్లించని యెడల ఒక నెలరోజుల పాటు జైలు శిక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొండపాటి గాంధీ రెడ్డి వాదించారు.
హత్య కేసులో ముద్దాయ కి యావజ్జీవ శిక్ష
12
Apr