తిరుపతి లో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా పాల్గొని వర్క్ షాప్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల, జంతువుల ప్రాణ నష్టం కలగకుండా, విద్యుత్తు శాఖ ఉద్యోగుల ప్రాణ నష్టం కలగకుండా, విద్యుత్తు సరఫరా పరికరాలు దెబ్బ తినకుండా, సబ్ స్టేషన్ లు పవర్ లైన్లకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టేలా ఉండాలని, సబ్ స్టేషన్లు, పవర్ లైన్ ల మైంటేనేన్స్ భద్రత ప్రమాణాలు అమలుతో చర్యలు చేపట్టాలని సూచించారు.
బుధవారం ఉదయం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ నందు విద్యుత్ ప్రమాదాల నివారణ పై డైరెక్టరెట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ మరియు ఎనర్జీ డిపార్ట్మెంట్, విజయవాడ వారు నిర్వహించిన వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా గౌ. విద్యుత్తు శాఖ మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఆర్ధిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మరో సారి రుజువైందని గుర్తు చేశారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు.
ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యం, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరం అని, ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.
అటవీ జంతువుల కట్టడికి కూడా విద్యుత్ వైర్లు లాగుతున్న పరిస్థితి ఉందని, వీటి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి మానవ, జంతువుల ప్రాణ నష్టం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడెలా ఉండరాదని, పవర్ లైన్ లు లూజ్ గా ఉండి పొలాలలో, రహదారుల్లో కిందపడి విద్యుత్గాతం బారిన మనుషులు, జంతువులు పడకుండా భద్రతా చర్యలు పటిష్ఠంగా ఉండాలని తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తె అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ శాఖకు వచ్చాయని, ఇది మంచి పరిణామం అని అన్నారు.
గత ప్రభుత్వంలో భారీగా ప్రచారం చేసుకున్నా కూడా వారు పెట్టిన సమ్మిట్ కు సంబందించి ఎక్కడా ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని అన్నారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సమ్మిట్ కు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు అయిందని, డివిజన్, సబ్ డివిజన్ స్థాయిలో కమిటీలు,
సబ్ స్టేషన్ లెవల్ లో కూడా కమిటీల ఏర్పాటుతో వారి సమన్వయంతో మరింత ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
అనంతపురం లో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చర్యలు చేపట్టామని అన్నారు. ఒకేసారి 15 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్స్ ను ఇప్పటికే నియమించామని, వారి సేవలు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని, ఒక పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థ సిద్దం చేయాలని సూచించారు. ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు సహకరించి వారికి విద్యుత్తు అందచేసే ప్రక్రియ సులభంగా మారేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజిపడటానికి వీల్లేదని సూచించారు.
ఈ వర్క్ షాప్ ద్వారా అందరికీ పూర్తి స్థాయి అవగాహన వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అనంతరం అధికారులు మంత్రిగారికి శాలువా కప్పి సత్కరించారు.
సమావేశ ప్రాంగణంలో విద్యుత్తు భద్రత ఉపకరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆం.ప్ర. డైరెక్టర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ మరియు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి విజయ లక్ష్మి, గోపాల్ రెడ్డి సీఎం డి (రిటైర్డ్) శివ ప్రసాద్ రెడ్డి , డైరెక్టర్ ఎస్పీడీసీఎల్ సుబ్బరాజు, డైరెక్టర్ ఎస్పీడీసీఎల్ జయ భారతిరావు, డైరెక్టర్ సి పి డి సి ఎల్, తిరుపతి ఏపీ ఎస్పీడిసీఎల్ ఎస్ ఈ కృష్ణా రెడ్డి, డిస్కం ఉద్యోగులు టీటీడీ ఎలక్ట్రికల్ వివిధ పరిశ్రమల అధికారులు డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.