శాసన పరిషత్ సభ్యులుగా తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ కు నూతనంగా ఎంపికైన తొమ్మిది మంది సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తొమ్మిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పి.వి.వి. సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళ వెంకటరమణ, కడప అనంతపూర్ – కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికైన ఎం.వి. రామచంద్రా రెడ్డి, ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు అనంతపూర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నికైన ఎస్.మంగమ్మ ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. చేశారు.
రాష్ట్ర జ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసన పరిషత్ సభ్యులు ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు శాసన పరిషత్ సభ్యులు, శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పి.పి.కె. రామాచార్యులు, రాష్ట్ర శాసన పరిషత్ ఓ.ఎస్.డి. సత్యనారాయణ, డిప్యుటీ సెక్రటరీ విజయరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *