నైపుణ్యాభివృద్ధి మరియు జౌత్సాహిక శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో జన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు నిరుద్యోగ యువతి యువకులను, మహిళలకు చక్కగా ఉపయోగపడుతున్నాయని డిబి ఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ డి కోటేశ్వరరావు అన్నారు. బొద్దికూరపాడులో బుధవారం | జెఎస్ఎస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌లో నైపుణ్యంలో బాగంగా మూడు నెలలో డ్రస్ తయారీపై శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. జెఎస్ఎస్ పొగ్రాం ఆఫీసర్ శ్యామ్ సునీల్ మాట్లాడుతూ … నేటి ఆధునిక కాలంలో యువతీ యువకులను, గృహిణీలకు టైలరింగ్‌లో నైపుణ్యం వలన ఆర్థికంగా చేయూత సాధిస్తున్నారని చెప్పారు. సాంకేతి పరిజ్ఞానం అందించటానికి జెఎస్ఎస్ చేస్తున్న కృషిని వివరించారు. వేల్పేర్ అసిస్టెంట్ ఫౌజియా, డిబిఆర్సీ తాళ్లూరు, ముండ్లమూరు మండల కోఆర్డినేటర్లు నాగమణి. వెంకటరావు, బ్యాంకు మిత్ర విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

