దర్శి నియోజక వర్గంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన రీజనల్ కోఆర్డినేటర్లు భూమా కరుణాకర్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్, పార్టీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడు వెంకట రెడ్డిలకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎదురు వెళ్లి పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం ఎస్పీ నాగార్జున రెడ్డి, హౌసింగ్ వేర్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి. జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, కౌల్సిలర్ వీ సీ రెడ్డి, సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచి హనుమంతరావు, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డి , అంబటి వేంకటేశ్వర రెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
