దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్లో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు కరిముల్లా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బుధవారం రాత్రి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర షేక్ కార్పోరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. ఎంభాష, ముస్లీం మత పెద్దలు, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం తదితరులు పాల్గొన్నారు.

