ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని వైసీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. తాళ్లూరు జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి గురువారం దర్శిలో మద్దిశెట్టి రవీంద్రను కలసి గ్రామాలలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహణకు అవసరమైన మెటీరియల్ పంపిణీ చేసామని, ఆయా గ్రామాలలో చురుకుగా జరుగుతున్నట్లు వివరించారు. సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ వేర్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచి హనుమంతరావు, దర్శి మండల నాయకుడు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

