ప్రభుత్వం పేద వర్గాలకు మంజూరు చేసిన జగన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డిలు కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం జగనన్న గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం లే అవుట్లో 93, వ్యక్తి గతంగా 108 గృహాలు మంజూరు అయ్యాయని అన్నారు. గృహాలు మంజూరు అయిన లబ్దిదారులను త్వరగా నిర్మాణాలు నిర్మించుకునే విధంగా పోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావు, సర్పంచి వలి, పిఎస్ శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ ఎఈ మనోహార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలి
13
Apr