26లోగా వాత్సల్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

మిషన్‌ వాత్సల్య పథకానికి సంబంధించిన ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని తాళ్లూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీవో సిహెచ్ భారతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పభుత్వాల సారథ్యంలో 18 సంవత్సరాలలోపు అనాథ బాలబాలికలు, తండ్రిని కోల్పోయినవారు, వితంతువు, విడాకులు తీసుకున్నవారు, కుటుంబం వదిలేసిన తల్లి, పిల్లలు, ప్రాణాంతక వ్యా ధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, ఆర్థిక శారీరకంగా పిల్లలు పెంచలే ని నిస్సహాయులు అర్హత పొందుతారన్నారు. ఈ పథకం కేంద్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు దరఖాస్తు చేసుకోవ చ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.72 వేలు, పట్టణ పాంతాల్లో రూ.96 వేలు ఆదాయం ఉన్నవారు అర్హత పొందుతారన్నారు. అర్హత పొందిన పిల్లలకు ప్రతినెలా రూ.4వేల చొప్పున ఆర్థిక చేయూత ప్రభుత్వం అం దిస్తుందని చెప్పారు. అర్హత కలిగినవారి వివరాలను క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు గుర్తించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *