ఉత్తమ సేవా పథకంకు ఎంపికయిన తాళ్లూరు వాసి ‘ ఇడమకంటి ‘

పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘ఉత్తమ సేవా పథకం” తాళ్లూరు వాసి అయి సూళ్లూరి పేట సీఐగా పనిచేస్తున్న ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ఎంపిక కావటం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల లోనికి వెళితే .. సా ధారణ రైతు ఇడమకంటి పెద్దిరెడ్డి కుమారుడైన ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి 1998లో హైదరాబాద్లో నాన్ లోకల్ సబ్ ఇన్స్ఫెక్టర్ పోస్ట్ పొందారు. మెదక్ జిల్లా అల్లా దుర్గం, సిద్ద పేట పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. హైదరాబాద్ నుండి జీఓ నంబర్ 610 ప్రకారం బదిలీ అయి గుంటూరు జిల్లా గురజాల పోలీస్ స్టేషన్లో 2005 నుండి 2007 వరకు ఎస్సైగా తీవ్రవాద ప్రాంతాలలో విధులు నిర్వహించాడు. అతని సేవలకు నాడు గుర్తుంచిన ప్రభుత్వం కఠిన సేవ పథకం ‘ ఇచ్చి సంస్కరించినది. అనంతరం 2011లో సబ్ ఇన్స్ఫెక్టర్ (సీఐ) గా పదోన్నతి పొంది గురజాల సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐగా, కొవ్వూరు, సూళ్లూరి పేట సీఐగా విధులు నిర్వహిస్తూ తన వంతుగా కోవిడ్లో సైతం అనే మంది బాధితులను ఆదుకున్నాడు. కోవిడ్ సమయంలో స్వంత గ్రామాలలో సైతం నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించారు. దేవాలయాలను సైతం బాగు చేసారు. ఆయా ప్రాంతాలలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను గుర్తించిన ప్రభుత్వం ఉగాది సందర్భంగా ఉత్తమ సేవా పథకానికి ఎంపికయ్యారు. ఆయనకు ఉత్తమ సేవా పథకం ఎంపిక కావటం పట్ల పలువురు గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *