రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శంకరాపురం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ ఆ మహనీయుడిని స్మరించుకోవాలి అని పిలుపునిచ్చారు. రామాయణం, ఖురాన్, బైబిల్, మేళ వించినదే భారత రాజ్యాంగం అని, అటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఒంగోలు పార్లమెంటు టిఎన్టియుసి అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి కొక్కెర నాగరాజు మాట్లాడుతూ0 గొప్ప ప్రజాస్వామిక వాది అంబేద్కర్ అని, భారతరత్న అని, భారత జాతీ గర్వించదగ్గ మహా జ్ఞాని అని అంబేద్కర్ చదువుతూ ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో బరోడా మహారాజు ముందుకొచ్చి ఆయనను చది వించారని అన్నారు. ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి వరగాని పౌలు మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని దళితుల అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో శంకరాపురం గ్రామ సర్పంచ్ కూరపాటి మహేశ్వరి నారాయణస్వామి, మేదరమెట్ల రాంబాబు, పేరం ఆంజనేయులు, తేలుకుట్ల రాంబాబు, దర్శి నియోజకవర్గ బీసీ సెల్ టిడిపి నాయకులు నందగోపాల్, తూర్పు కంభంపాడు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చాగంటి రాంబాబు, తమ్మినేని బ్రహ్మం, శంకరాపురం విద్యా కమిటీ చైర్మన్ మందలపు శ్రీనివాసరావు, గొర్రెల సొసైటీ అధ్యక్షులు మందలపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
