తాళ్లూరు మండలంలో అంబేడ్కర్ కు ఘన నివాళి

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు శుక్రవారం మండలంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి, వెల్లంపల్లి రోడ్, హరిజన వాడలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వరరెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, ఎంపీడీఓ వి. శ్రీనివాసరావు, ఎంఈఓ జి సుబ్బయ్య, ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, ఎంఆర్పీఎస్ నాయకుడు అనపర్తి ఆదాం, ప్రకాశం, సీమాన్ , సురేష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసారు.
తాళ్లూరులోని అంబేడ్కర్ నగర్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆయన చిత్ర పటానికి దార అంజయ్య, ఎఎస్సై మోహనరావులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు మండలంలోని అన్ని సచివాలయాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా గ్రామాల సర్పంచిలు, గ్రామకార్యదర్శులు, విఆర్డీలు పాల్గొన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ – రక్తదాన శిబిరం నిర్వహణ

అంబేడ్కర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ నగర్ నుండి పాత సినిమా హాల్, కార్యాలయ సముదాం, వెల్లంపల్లి, ముండ్లమూరు బస్టాండ్, రజానగర్ రోడ్డు మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ నుండి భారీ ర్యాలీ అంబేడ్కర్కు జేజేలు పలుకుతూ
సాగినది. బైక్ ర్యాలీలో కాగడా వెలిగిస్తూ యువతీ, యువకులు ఉత్సాహంగా
పాల్గొన్నారు.

రిమ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ …..
ఒంగోలు రిమ్స్, అంబేడ్కర్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. 32 మంది రక్తదానం చేసినట్లు అంబేడ్కర్ యూత్ బాధ్యులు తెలిపారు.
సంఘ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *