అత్యవసర ప్రమాదాలతో ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రజల ధన,’ ప్రాణాలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది కృషి అభినందనీయమని దర్శి సీఐ
జె రామకోటయ్య కొనియాడారు. అగ్ని మాపక వారోత్సవాలను శుక్రవారం ప్రారంభమైనాయి. దర్శి అగ్నిమాపక కేంద్రం అధికారి సీహెచ్ జాలయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఐ రామకోటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అగ్నిమాపక శాఖ ప్రాముఖ్యతను వివరించారు. గతంలో అమరులైన వారి సేవలను స్పూర్తిగా తీసుకుని విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం స్టాల్స్ ను, కరపత్రాలను విడుదల చేశారు.సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
అమరులకు ముందుగా నివాళులు అర్పించారు. బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.
