అయ్యప్పస్వామి దేవస్థానం అభివృద్ధికి మాజీ మంత్రి శిద్ధా రూ. 2లక్షలు విరాళం -కృతజ్ఞతలు తెలిపిన ఆలయ అభివృద్ధి కమిటి బాధ్యులు

దర్శి పట్టణంలోని అయ్యప్పస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు
వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు రూ. 2లక్షలు నగదును అందించారు. ఒంగోలులో ఆయన నివాసంలో శుక్రవారం ఆలయ కమిటి బాధ్యులు కలసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని, అందుకు దాతలు చేయూత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. స్పందించిన శిద్ధా రాఘవరావు దంపతులు .
తమ వంతుగా రూ. 2లక్షలు ఆలయ అభివృద్ధి కమిటీ బాధ్యులకు అందించారు.
కమిటి బాధ్యులు శిద్ధా దంపతులను సన్మానించారు. శిద్ధా దంపతులకు కృతజ్ఞతలు తెలిపి, వారిని ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *