అంబేడ్కర్ సేవలు స్ఫూర్తిదాయం- ఆయన ఆయన సాధనకు కృషి చెయ్యాలి -ఘనంగా అంబేడ్కర్ఆయంతి వేడుకలు

భారత రాజ్యాంగ శిల్పి, ప్రజా స్వామ్య పరిరక్షకుడు. సంఘ సంస్కర్త డాక్టర్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతిని నియోజక వర్గంలో శుక్రవారం ఘనంగానిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎంపీపీ జీఎస్ అచ్చారావు, దర్శి, దొనకొండ జెసీఎస్ కన్వినర్లు కోటిరెడ్డి. జి పోలయ్య, కౌల్సిలర్లు బాబు, మోహన్ బాబు, వీసీ రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నా రెడ్డి. కొండవటి జాన్, అచ్చారావు, జగన్మోహన్ రావు, విజయ్, శ్రీను, యర్రయ్య, రవి తదితరులు “పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి ఎంపీపీ జీఎస్ అచ్చారావు, డీఎల్పీఓ శోభన్ బాబు, ఎంపీటీసీలు, సిబ్బంది పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

దళిత, బిసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో…
దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 132వ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సై రామక్రిష్ణ, గర్నేపూడి ప్రేమకుమార్, గోవింద ప్రసాద్ పాల్గొన్నారు.

నగర పంచాయతీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసినివాళులు అర్పించారు. చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ స్టీవెన్, కోటయ్యలు కమీషనర్ వై మహేశ్వరరావు, పలువురు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, అసెంబ్లీ ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఘన నివాళులు అర్పించారు.

టిడిపి ఆధ్వర్యంలో చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, మండల అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు ఇతర ప్రతినిధులు పూల మాలలు వేసి

నివాళులు అర్పించారు.

దర్శి డీఎస్పీ, సీఐ కార్యాలయాలలో, పోలీస్ స్టేషన్లో సబ్ జైలులో, సీపీఎం,
సీపీఐ కార్యాలయాలలో … కృషి విజ్ఞాన కేంద్రంలో యూటీఎప్, ఎపీటీఎఫ్ కార్యాలయాలల్లో మండలంలోని అన్ని సచివాలయాల్లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి సర్పంచిలు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

దర్శి మండలం తూర్పు వీరయపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 10 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన గ్రామస్తులు.. కార్యక్రమంలో పాల్గొన్న డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి తాసిల్దార్ శ్రవణ్ కుమార్, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఎస్ఐ డి రామకృష్ణ, దళిత ప్రజా సంఘాల నాయకులు ప్రేమ్ కుమార్, గోవింద ప్రసాద్ మాదిగ, సంఘ సేవకులు రత్నం, ఎంపీపీ అచ్చయ్య సుధారాణి పలువురు ప్రజాప్రతినిధులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *