దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెంలో అంబేడ్కర్ యువసేన
ఆధ్వర్యంలో పది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కమిటీ సభ్యులు కె. బసవరాజు, ఎంపీపీ జీఎస్ అచ్చారావు, తహసీల్దార్ శ్రవణ్కుమార్, సంఘ సేవకులు రత్తరీ, దళిత, ప్రజా సంఘాల నాయకులు గోవింద్ ప్రసాద్, ప్రేమ్ కుమార్, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, ఎస్సై రామక్రిష్ణ, ముఖ్య అతిథులుగా పాల్గొని శుక్రవారం రాత్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ జీవిత చరిత్రను, సమాజం కోసం పాటు పడిన విధానాన్ని వక్తలు వివరించారు.


