ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని ఓడించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో ప్రచార భేరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సిపిఐ సిపిఎం నాయకులు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీగా వచ్చి గడియారం స్తంభం సెంటర్లో ప్రచార బేరి నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు,తాండవ రంగారావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కారు చౌకగా విక్రయిస్తున్నారని అందువల్ల దేశంలోని ప్రజానికం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలియజేశారు. 75 సంవత్సరాల క్రితం అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించుకున్నటువంటి మన రాజ్యాంగం మోడీ,అమిత్ షా ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ దర్శి పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు సందు వెంకటేశ్వర్లు ,కల్లూరు చిన్న ఆంజనేయులు ,ఆర్ కరుణానిధి ,గోగు వెంకయ్య ,సిహెచ్ అరుణ ,పసల కోటేశ్వరరావు ,జూపల్లి శ్రీనివాసరావు ,ఉప్పు నారాయణ ,పుల్లయ్య ,అంజిబాబు ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మోడీని ఓడించండి దేశాన్ని కాపాడండినేటి నుంచి సిపిఐ – సిపిఎం ప్రచార భేరిఅంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన సిపిఐ సిపిఎం నాయకులు
14
Apr