అంబేద్కర్ ఆశయాల కొనసాగింపే నిజమైన నివాళి – రీజనల్ కోఆర్డినేటర్ -బాలినేని శ్రీనివాసరెడ్డి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీని వాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక వేమాయల్లయ్య భవనం ప్రాంగ ణంలో జడ్పిటిసి వేమా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. సభకు స్థానిక ఎమ్మెల్యే టిజెఆర్. సుధాకరబాబు అధ్యక్షత వహించారు. వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని మాట్లాడుతూ ..వేమాశ్రీనివాసరావు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే వేమా యల్లయ్య మార్గం లో నడుస్తూ ప్రజాసేవ చేయడం అభినంద నీయమన్నారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అంబే ద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడారు. ముందుగా స్థానిక పిహెచ్సిలో ఏర్పాటు చేసిన మాజీ ఎంపిపి పిహెచ్సి స్థల దాత సుంకరమస్తాన్ రెడ్డి కాంస్య
విగ్రహాన్ని,
జనరేటర్ బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్టు పిహెచ్సి ముఖద్వారం, వేమా యల్లయ్య ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని, మున్సిపల్ ఓపెన్ జిమ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ చల్లా అంకులు, ఎంపిపి యద్దనపూడి శ్రీనివాసరావు, జడ్పిటిసి వేమా శ్రీనివాసరావు, మండల వైసిపి అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు కె. శేఖరరెడ్డి, వైసిపి నాయకులు చిన్నపురెడ్డి మస్తానరెడ్డి, జి.ఓబులరెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, జ్యేష్ట శ్రీను, బాపతు వెంకటరెడ్డి, మంచా హరికృష్ణ, పి గంగయ్య, ఎస్ కె బాషా, పేరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *