దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున అద్దంకి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో పసుపుగల్లు గ్రామ సమీపంలోని సాయిబాబా గుడి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే అద్దంకి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు శనివారం వేకువజామున దర్శి నుండి అద్దంకి వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న చెరుకుతోవెళుతున్న ట్రాక్టర్ ను తప్పించబోయి మార్జిలోకి దిగగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో బస్సులో 9మంది ప్రణాళికలతో పాటు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉన్నారు. అందులో ఓ మహిళకు గాయాలు కావడంతో 108 వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తప్పిన పెను ప్రమాదం—— ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి న సమీపంలో లెవెన్ కె.వి విద్యుత్తు స్తంభాన్ని తాకినది. అయితే బలంగా కొనకపోవడంతో విద్యుత్ స్తంభం బస్సుకు ఆని0ది. కానీ విద్యుత్ తీగలు బసుకు తగిలినట్లయితే కాలి బూడిద అయిపోయే వారని స్థానికులు ప్రయాణికులు చర్చించుకుంటున్నారు.
