రైతులు వేసవి దుక్కులు అనంతరం మట్టి నమూనా భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎన్ మేరమ్మ అన్నారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో శనివారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొలాలలో, గట్ల వెంబడి, చెట్లు నీడలలో, కాలువల వెంబడి ఎరువులు వేసిన పొలాలలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. ఐదు ఎకరాల్లో ఒక మట్టి నమూనా శాంపిల్ తీసుకుంటే సరిపోతుందన్నారు. అక్కడక్కడ మట్టి నమూనాలను సేకరించి జిగ్ జాగ్ రూపంలో 15 నమూనాలను సేకరించాలని, వి ఆకారంలో 15 మీటర్ల లోతులో గుంటలు తీసి అంచులు వెంబడి తీసిన మట్టిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు
