ప్రభుత్వ సేవలను ప్రజలలోనికి విస్తృతంగా తీసుకువెళ్లటానికి చిత్త శుద్దితో కృషి చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండలంలోని వలంటీర్లుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ … సేవలు అందించటంతో పలువురు వలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిదని అన్నారు. వలంటీర్ల సేవలపై పూర్తి నమ్మకంతో ఉన్నందున ప్రజలకు సేవ అందించటంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న వారికి తక్షణం నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావును కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసి ప్రభుత్వం సేవలను విస్తృతంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలని కోరారు. ఈఓఆర్డీ ఎన్ యూ ప్రసన్నకుమార్, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి , గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
