ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గము పరిధిలో ఉన్న దర్శి, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు సమీక్షా సమావేశం దర్శి లో నిర్వహించారు. ఈ కార్య్రమానికి అతిథిగా కార్య నిర్వాహక అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ హాజరు అయ్యారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమం దర్శి నియోజకవర్గ బాధ్యుడు పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యము లో జరిగింది. కార్య్రమానికి అయా నియోజక వర్గము ల బాధ్యులు, షేక్ సైదా, పగడాల రంగస్వామి, మెడబలిమి వెంకటేశ్వరరావు , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నూరి సీతారామాంజనేయులు, రంగనాయకులు(కనిగిరి), షేక్ రసూల్, ఆదినారాయణ రెడ్డి, దేవరపల్లి సుబ్బారెడ్డి ( కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు) బొడ్డు సతీశ్, పుల్లారెడ్డి, రమణా రెడ్డి, ఖాసిం, మస్తాన్, మోషే, సుబ్బారావు మరియు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

