శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్లు, హాస్టళ్ల నిర్మాణానికి రూ.53.62 కోట్లు మం జూరు చేసినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలి పారు. టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశం శనివారం తి రుమల అన్నమయ్య భవనంలో జరిగింది. సమావే శంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. విదేశీ విరాళాల స్వీకరణ చట్టం (ఎఫ్ సీఆర్ఎ ) ప్రకారం విదేశీ భక్తుల విరాళాలు స్వీకరిం డానికి అనుమతి 2020 జనవరికి ముగిసింది. దీని రెన్యువల్ కు టీటీడీ దరఖాస్తు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడిగిన సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు అందించాం. ఎఫ్సీఆర్ఎ, రాష్ట్ర దేవదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల
విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ఇది సాంకేతిక కారణం మాత్రమే. ఎఫ్సీఆర్ఎ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించాం. ఈ సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నామని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకరరెడ్డి,
పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
*ట్రస్టు బోర్డు తీసుకున్న మరికొన్ని ప్రధాన నిర్ణయాలు..*
టీటీడీ విద్యా సంస్థల్లో రెగ్యులర్ బోధన సిబ్బంది నియామకానికి ఆమోదం. ఇప్పటికే పనిచే స్తున్న కాంట్రాక్టు బోధన సిబ్బందిని కొనసా గిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం.
తిరుపతిలో శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15కి అందుబాటు లోకి తేవాలని నిర్ణయం
* అలిపిరి వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు.
*గుంటూరుకు చెందిన ఆలపాటి తారాదేవి రూ. 10 లక్షలతో వెండి కవచాన్ని బేడి ఆంజనే యస్వామి వారికి అందించేందుకు ఆమోదం.
*తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఆధునీకరణకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం.
* న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియం అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు
* ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్తో చర్చించేం దుకు బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కమిటీ ఏర్పాటు.


