కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎస్) కానిస్టేబుల్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సిఎపిఎఫ్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (టిబిపి), సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్ఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎ) భాగంగా ఉంటాయి. హిందీ, తో పాటు అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్ గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి వంటి 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. సిబ్బంది రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన పరీక్షను తమిళ భాషలో నిర్వహించాలని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతూ లేఖ రాశారు. దీని తర్వాత ఈ ప్రకటన వచ్చింది. హిందీ, ఇంగ్లీష్ పరీక్ష రాయడం వల్ల ఇతర భాషల ఆశావహులు నష్టపోతున్నారని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.