ప్రముఖ సాహితీ వేత్త పద్యం రచయిత ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన చెట్రోలు రామకోటయ్యకు అమేజింగ్ వర్డ్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కటం పట్ల మండల ప్రజలు, సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో మహాతి ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో 150 గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మాత్సవాలు 48 గంటల పాటు నిర్వరామంగా జరిగాయి. ఈ ప్రదర్శనలో 48 గంటల పాటు పద్య కవితలు గానం చేసి ప్రతిభ చాటిన చేబ్రోలు రామకోటయ్యకు అమెజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కల్చరల్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మార్పేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు ఆసోషియేషన్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేబ్రోలు రామకోటయ్య పేరున నమోదు చేస్తూ దృవీకరించారు. శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక ప్రశంశా పత్రాన్ని అందించారు. కార్యమంలో శ్రీ శ్రీ కళాపరిషత్ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ పిళ్లం గోళ్ల శ్రీలక్ష్మి, ఇంద్రాణి చారిటబుల్ డ్రస్ట్ చైర్మన్ ఇంద్రకుమార్ రాజా, పొగ్రాం కన్వినర్ గుత్తా హరి సర్వోత్తమ నాయుడు, ప్రోగ్రాం ఆర్గనైజర్ కొల్లి రమావతి. భాగ్య లక్ష్మి ఈశ్వరి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
