ఆలిండియా ఘంటసాల చైతన్య వేదిక 12వ జాతీయ మహాసభలు ఈనెల 23వ తేదీ గుంటూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక బ్రాడీ పేట యుటిఎఫ్ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ…. నైతిక విలువలతో కూడిన మానవీయ సమాజం ఏర్పడాలంటే విద్య, కళలు ద్వారా సాంస్కృతిక విప్లవం జరగాలనే భావనతో జన విజ్ఞాన వేదిక, స్టెప్పు, ప్రగతి నారీశక్తి, అవగాహన సంస్థల సహకారంతో ‘మానవుడే మహనీయుడు’ అంశంతో ఒకరోజు వర్క్ షాప్ స్థానిక రాజీవ్ గాంధీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ నగరంలోని స్కూల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కళలు, సాంస్కృతిక రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ ప్రజల, ప్రభుత్వాల కర్తవ్యం తదితర అంశాలపై మేధావులతో చర్చతో పాటు 100 సినీ, దేశభక్తి, అభ్యుదయ చైతన్య గీతాల సంగీత విభావరి రోజంతా జరుగుతుందన్నారు.
కళాకారులు, సంగీతాభి మానులు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా
కోరారు. నర్రా రాజశేఖర్, ఆలా అనంత రామయ్య, షేక్ సుభాని, కె ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు .
23న ఘంటసాల చైతన్య వేదిక మహాసభలు – విజయవంతం చేయాలి -ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి
18
Apr