పాడి రైతులకు ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ద్వారా అందిస్తున్న
ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని పశుపోషణ ద్వారా పాడి పరిశ్రమని అభివృద్ధి చేయ్యాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి (డిఎడీఓ) కె బీబి రాణి అన్నారు. దారం వారి పాలెంలో మంగళవారం ఉచిత పశువైద్యశిబిరం పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి (డిఎ డీఓ) కె బేబి రాణి మాట్లాడుతూ…. వేసవిలో పశువులను రక్షించుకోవాలని, పశుపోషణకు పాటించాల్సిన మేలుకులను వివరించారు.
పశుసంవర్థకశాఖ ద్వారా సబ్సిడీపై అమలులో ఉన్న దాణామృతం, చాఫ్ కట్టర్, గడ్డి జొన్నలు పథకం వినియోగించుకోవాలని కోరారు. 46 మంది పశుపోషకులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసారు. సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, దర్శి సహాయ సంచాలకులు డాక్టర్ ఎ. పురుషోత్తం రాజు, తాళ్లూరు, తూర్పు గంగవరం పశువైద్యాధికారులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ రాంబాబు, ఎఎంసీ మాజీ డైరెక్టర్ దారం రమణా రెడ్డి, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

