పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగు బడులు

రైతులు తాము వేసిన పంటలలో చీడపురుగు లు ఆశించినప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పురుగుల ఉధృతి తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ పి వి వి దుర్గాప్రసాద్ అన్నారు. మండలంలోని పెదపుల్లగల్లు గ్రామంలో బుధవారం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల సి ఎస్ పురం విద్యార్థులు, ఎన్ఎస్ వ్యవసాయ కళాశాల మార్కాపురం విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో రైతు సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఏఏ సీజన్లో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలుసుకొని రైతులు ఆ పంటలపై దృష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి ఉన్నందున దాని నివారణకు వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలతో మందులు పిచికారి చేయాలన్నారు. ఉల్లగల్లు గ్రామంలో జిల్లెల్లమూడి తిరుపతయ్య అనే రైతు 52 0 4 అనే బిపిటి రకం వరి వేసి 50బస్తాలు దిగుబడి సాధించారని, సందాడి శీను అనే రైతు 1010 అనే బిపిటి రకం ఒక ఎకరానికి 50 బస్తాలు పండించిన వీరిద్దరికీ బహుమతులు ప్రధాన చేశారు. ఏ ఆర్ ఎస్ కీటక విభాగం శాస్త్రవేత్త ఎల్ రాజేష్ చౌదరి మాట్లాడుతూ రైతులు పంటలు వేసే ముందు భూసార పరీక్షల ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత రైతులు తమ అనుభవాలకు అనుగుణంగా సాగు చేసే పద్ధతుల గురించి వివరించారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్ లీలా కృష్ణ మాట్లాడుతూ రైతులు వరి నాటే సమయంలో కాలి బాటలు ఏర్పాటు చేసుకుని వరి నాటినట్లయితే గాలి బాగా వీస్తూ దుబ్బు ఎక్కువగా క డుతుందన్నారు . పంట పొలాల్లో మందులు పిచికారి చేయాలన్న, కలుపు తీయాలన్నా కాలిబాటలతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. . గ్రామీణ వ్యవసాయ రైతుల అనుభవాల కార్యక్రమంలో భాగంగా రైతులు సాగు చేసే పద్ధతులు, పంటలపై పాటించిన సస్యరక్షణ చర్యల గురించి కళాశాల విద్యార్థులు మూడు నెలలపాటు నేర్చుకున్న అనుభవాల కార్యక్రమం సదస్సు నిర్వహించారు . కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు మాల కొండయ్య, చెన్న బసవ, సాయి తేజ ,మోహిత్ కుమార్, జస్వంత్, నాగరాజు, నవీన్, శివకుమార్, సంతోష్, హర్షవర్ధన్, సాయిరాం ,లక్ష్మి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *