చిరుధాన్యాలను ఉపయోగించుకోవాలి

ప్రజలు చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలిసికొని ఉపయోగించుకోవాలనివ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. క్షేత్ర పర్యటనలో బాగంగా గురువారం మాధవరంలో పర్యటించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. మాధవరంలోచిరుధాన్యాల నూర్పిడి యత్రంను పరిశీలించి నూర్పిడి విధానంను అడిగి తెలుసుకున్నారు. కొర్రలు, అండ్రు కొర్రలు, ఊదలు, సామలు, ఆరికలు జల్లెడలు మార్చి నూర్పిడిలు చేస్తారని చెప్పారు. సజ్జలు, రాగులు పిండి పట్టటం, జొన్నలు పొట్టు తీసే యంత్రాలు కూడ పలు చోట్ల అందుబాటులో ఉన్నాయని అన్నారు. విఏఏ సుధీర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *