ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు నూతన ప్రజా స్వామ్య ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా పెద్దల మద్దతు కూడగట్టాలని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా కన్వినర్ రావినూతల కోటి మాదిగ్ అన్నారు. తాళ్లూరులో గురువారం నియోజకవ వర్గ ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎంఆర్పీఎస్ కన్వినర్ రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ… ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు 28 ఏళ్లుగా అనేక పోరాటాలు చేసినా రిజర్వేషన్ వర్గీకరణ మాత్రం జాప్యం జరగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈనెల 28న అడ్డంకి అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తారని జయప్రదం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆదాం మాదిగ, ఎం. ఎస్. ఎఫ్ రాష్ట్ర నాయకులు పల్లెపోగు త్రిపుర మాదిగ, ఎంఆర్పీఎసీజిల్లా నాయకులు మల్లెల ప్రసాద్, రేనమాల మాధవ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు ప్రజా స్వామ్య ఉద్యమానికి మద్దతు కూడ గట్టాలి
20
Apr