రైతుల భూములు ప్రభుత్వ భూములు పెండింగ్ లో ఉన్న భూములకు రీ సర్వే తో విము క్తి లభించనున్నదని తహసిల్దార్ నయీమ్ అహ్మద్ అన్నారు. మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని తమ్మలూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీ సర్వేను వేగవంతం చేయాలన్నారు. భూములు కలిగిన వారు తమకు సంబంధించిన రెవిన్యూ రికార్డులైన ఆర్ఎస్ఆర్, ఎఫ్ ఎల్ ఆర్, వన్ బి, వన్ ఎ, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని మీ గ్రామంలో జరుగుతున్న ఈ సర్వే గ్రామ సభకు హాజరై వివరాలు తెలియజేయాలన్నారు. అధికారులు రికార్డులు ఆధారంగా పరిశీలించి వారికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్, సర్వేయర్ వెంకటరెడ్డి, వీఆర్వో రవి, తదితరులు పాల్గొన్నారు
రీ సర్వే తో భూములకు రక్షణ
20
Apr